Sunday, April 28, 2024

SIDDIPET | బీఆర్ఎస్ టార్గెట్‌గా మావోయిస్టు పోస్ట‌ర్లు

సిద్దిపేట‌ప్ర‌తినిధి, (ప్ర‌భ‌న్యూస్‌):
ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సిపిఐ మావోయిస్టు పార్టీ వాల్ పోస్టర్లో హెచ్చరికను జారీ చేసింది తెలంగాణ రాష్ట్రం సాధించుకొని 10 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ ఈ ప్రాంతంలోని రైతులు చేనేత కార్మిక వర్గం విలవిలలాడుతున్నారు. వారు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక జీవనోపాధి కోసం దుబాయ్ గల్ఫ్ దేశాలకు వలసలు వెళుతున్నారు. పల్లెలను కూడా కలుస్తాం చేస్తున్నారు.

అధికార పార్టీ టిఆర్ఎస్ నాయకులు ఇసుక మాఫియా భూకబ్జాలు చేస్తూ తాడిత పీడిత ప్రజలపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. చట్టం ప్రయోగిస్తూ వారిని మర్డర్లు చేస్తున్నారు. మేధావులను యువకులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. టిఆర్ఎస్ అధికార పార్టీ నాయకుల అండదండలతో గ్రామాలు మండల జిల్లా స్థాయి టిఆర్ఎస్ నాయకులు ప్రజలపై పెత్తనాలు చలాయిస్తూ మీరు చెలాయిస్తున్న పెత్తనాన్ని పీడిత ప్రజలు ఐక్యంగా ఎదుర్కొంటూ ప్రతిఘటించాలని పిలుపునిస్తున్నాం. టిఆర్ఎస్ నాయకులు కొనసాగిస్తున్న దోపిడి విధానాలను దౌర్జన్యాన్ని ఆపకపోతే ప్రజల సమక్షంలో శిక్షలు తప్పవని హెచ్చరిస్తున్నాం.

- Advertisement -

తెలంగాణ ప్రజల వారసత్వ సహజ సంపదను టిఆర్ఎస్ రాజకీయ నాయకులు మైనింగ్ మాఫియాకు మారి వారి సొంత ప్రయోజనాలకు కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తం చేస్తున్నారు యువత మేధావి వర్గం కలిసి సహజ సంపదను రక్షించుకోవాలి. విప్లవ వందనాలతో తెలంగాణ రాష్ట్ర కమిటీ సిపిఐ మావోయిస్టు ఈ గోడ పత్రికలను సిపిఐ మావోయిస్టు పార్టీ గురువారం నాడు అర్ధరాత్రి దుబ్బాక పట్టణ శివారులో ఉన్న ఏదుల చెరువు అలుగు పారే బ్రిడ్జి పై ఉన్న కడిగి ఒక మావోయిస్టు కరపత్రాన్ని అతికించగా అదే రోడు గుండా దుంపలపల్లి గ్రామం కు చేరువలో ఉన్న బీరప్ప దేవాలయం ముందు ఉన్న రోడ్డు కల్వర్టు గోడకు మరో మావోయిస్టు గోడ పత్రికను అతికించారు.

గతంలో దుబ్బాక ప్రాంతం మావోయిస్టు పార్టీకి పుట్టినిల్లుగా విరాజిల్లింది. దుబ్బాక పేరు మీద పీపుల్స్ వార్ పార్టీ టీం కూడా సంచరిస్తూ ఈ ప్రాంతం విప్లవాలకు పెట్టింది పేరుగా ప్రసిద్ధిగాంచింది. ఆ రోజుల్లో దుంపల పల్లి గ్రామానికి చెందిన మల్లేశం అని మావోయిస్టు పోలీసు ఎన్‌కౌంట‌ర్‌లో మృతి చెందడం జరిగింది. అదేవిధంగా దుబ్బాకకు చెందిన మావోయిస్టు సూపరు మల్లేశం కూడా పోలీసు ఎన్కౌంటర్లో మృతి చెందడం జరిగింద. దుంపలపల్లి లో మృతి చెందిన అమరుడు మల్లేశం పేరున ప్రజలు స్తూపం కూడా నిర్మించారు. మావోయిస్టు వాల్ పోస్టర్లు వెలసిన విషయంపై దుబ్బాక సీఐ మన్నె కృష్ణ ఎస్సై గంగరాజులను సంప్రదించగా ఇప్పటివరకు తమకు ఎలాంటి సమాచారం లేదని వారు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement