Saturday, October 12, 2024

Maktal – కాంగ్రెస్ ఆరు హామీలు అమలు చేస్తాం .. బాండ్ పేప‌ర్ పై అభ్య‌ర్ధి శ్రీహ‌రి సంత‌కం

మక్తల్, నవంబర్27(ప్రభన్యూస్) – అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామని ఆ బాధ్యత నేను తీసుకుంటానని మక్తల్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి వాకిటి శ్రీహరి అన్నారు. సోమవారం రోజు అభ్యర్థి తమ ఇంటి దేవుడైన మక్తల్ పట్టణంలోని శ్రీ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయంలో దేవుడి ముందు వంద రూపాయల బాండ్ పై సంతకం చేశారు .
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ.2500, రూ. 500 కే గ్యాస్ సిలిండర్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం గృహజ్యోతి పథకం కింద ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు కల్పిస్తామని అన్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు ,యువ వికాసం కింద విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు, చేయూత పథకం కింద వృద్ధులకు నెలకు రూ.4000 పెన్షన్ ,10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా రైతులు ,కౌలు రైతులకు ఎకరానికి రూ.15 వేలు రైతుబంధు వ్యవసాయ కూలీలకు రూ.12000 వరి పంటకు 500 రూపాయల బోనస్ విధిగా అమలు చేస్తామని అన్నారు.

దేవుడిపై ప్రమాణం చేసి బాండు పై సంతకం చేస్తున్నానని ప్రజలు తనను నమ్మి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా అఖండ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపించాలని ఈ సందర్భంగా వాకిటి శ్రీహరి నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు .అదేవిధంగా నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరించి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ మాన్వి రామారావు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బోయ రవికుమార్ ,నాయకులు సుందర్,నాగరాజు మిస్కిన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement