Thursday, May 2, 2024

తెలంగాణ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం..

పానగల్ : మండలంలోని మాందాపూర్, బుసిరెడ్డిపల్లి ,కేతేపల్లి గ్రామలలో సెర్ఫ్ (ఐ.కె.పి), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని,రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామన్నారు. దళారుల బెడద అరికట్టేందుకు గ్రామాలలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని.. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.కొనుగోలు కేంద్రాల్లో రైతులను మోసం చేస్తే ఉపేక్షించేది లేదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని నిరంతరం రైతుల శ్రేయస్సు గురించి ఆలోచించే ఏకైక ప్రభుత్వమని అన్నారు. అన్ని పంటలకు ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తున్నామని,సిఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని అన్నారు.రైతుల కోసం రైతు రుణమాఫీ, రైతుబంధు, రైతు బీమా, 24 గంటల కరెంట్,పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుందని తెలిపారు.కరోనా సెకండ్ వేవ్ పెరుగుతున్న కారణంగా రైతులందరూ మాస్క్ లు ధరించాలని,తప్పకుండా బౌతిక దూరం పాటించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీధర్ రెడ్డి,వైస్ ఎంపీపీ కవిత,విండో చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి,వైస్ చైర్మన్ బాలయ్య,రైతు బంధు సమితి మండల కో ఆర్డినేటర్ వెంకటయ్య నాయుడు,మార్కెట్ డైరెక్టర్ రఘుపతి నాయుడు, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాము యాదవ్,మాజీ జడ్పీటీసీ రామూర్తి నాయుడు, గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ లు జయ రాములు,భాస్కర్ రెడ్డి,అనిత,శ్యామల,సుబ్బయ్య యాదవ్, ఏపీఎం మద్దిలేటి,సీఈఓ భాస్కర్ గౌడ్,విండో డైరెక్టర్లు, సిబ్బంది,ఐకేపీ సిబ్బంది,టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement