Wednesday, October 9, 2024

Mobile Blast: ప్యాంటు జేబులో పేలిన ఫోన్.. భయంతో స్థానికుల పరుగులు

ఓ వ్యక్తి జేబులో ఉన్న సెల్ ఫోన్ పేలిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని గద్వాలలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో బాధితుడు ఎలాంటి గాయాలు కాకుండా తప్పించుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గద్వాలలోని బీసీ కాలనీకి చెందిన జయరాముడు కూరగాయాలు కొనేందుకు మార్కెట్‌ వచ్చాడు.

ఈ క్రమంలో జేబులో ఉన్న ఫోన్ పేలిపోయింది. ఫోన్ భాగాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఫోన్ పేలుడుతో భయపడిన స్థానికులు దూరంగా పరుగులు తీశారు. బాధితుడి ప్యాంటు కాలిపోయింది. జయరాముడు వెంటనే అప్రమత్తం కావడంతో ఎలాంటి గాయాలు లేకుండా తప్పించుకున్నాడు. ఒక్కసారిగా ఫోన్ పేలడంతో సౌండ్ రావడంతో అక్కడి నుంచి స్థానికులు పరుగులు తీశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement