Sunday, April 28, 2024

MBNR: మ‌ల్లు ర‌వి ప్ర‌చారంలో త‌న్నులాట‌… సీనియ‌ర్ నేతకు గాయాలు

గద్వాల (ప్రతినిధి) ఏప్రిల్ 17 (ప్రభ న్యూస్) : గద్వాల నియోజకవర్గం మల్దకల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. గద్వాల నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ప్రచార రథం ఎక్కే చోట ఇద్దరు కాంగ్రెస్ నాయకుల మధ్య గొడవ తీవ్ర స్థాయికి చేరుకున్నది.

వివరాల్లోకి వెళితే… గద్వాల నియోజకవర్గంలోని మల్దకల్ మండలంలో బుధవారం ఉదయం 11గంటల సమయంలో నాగర్ క‌ర్నూల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మల్లురవి ఎన్నికల ప్రచార కార్యక్రమానికి జోగులాంబ గద్వాల జిల్లా జడ్పీ చైర్ ప‌ర్స‌న్ సరితా తిరుపతయ్య ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్దకల్ మండల కేంద్రంలో ఎన్నికల ప్రచార రథంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మల్లురవి, అల్లంపూర్ మాజీ శాసనసభ్యులు, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, జడ్పీ చైర్ పర్సన్ సరితా తిరుపతయ్య, మాజీ ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ తదితర కాంగ్రెస్ నాయకులు ప్రచార రథంపై ఉన్నారు. మల్దకల్ మండల కేంద్రంలో ప్రచార రథం పైకి ఎక్కేందుకు గద్వాల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండ్ల రాజశేఖర్ రెడ్డి, బండ్ల చంద్రశేఖర్ రెడ్డి వెళ్ళగా ప్రచార రథంపైకి ఎక్కడానికి వీల్లేదంటూ మల్దకల్ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దోడి రామకృష్ణ అడ్డగించారు.

దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. ప్రచార రథంపైకి ఎక్కవద్దనడానికి నువ్వెవడివి అంటే నువ్వెవ‌డివి అని ఇద్దరు నాయకులు తీవ్ర పదజాలాలను వాడినట్లు తెలుస్తోంది. ఇద్దరు మధ్య మాట మాట‌ పెరగడంతో ప్రచార రథంపైన ఉన్న పెద్దొడ్డి రామకృష్ణ బండ్ల చంద్రశేఖర్ రెడ్డిపై దాడి చేసినట్లు నాయకులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండ్ల చంద్రశేఖర్ రెడ్డిపై పెద్దొడ్డి రామకృష్ణ కావాలనే పథకం ప్రకారం నాపై దాడి చేశాడని బండ్ల చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రచార రథం ఎక్కే క్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బండ్ల చంద్రశేఖర్ రెడ్డిపై పెద్దొడ్డి రామకృష్ణ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేశారని తెలిపారు. గాయపడిన కాంగ్రెస్ నాయకుడు బండ్ల చంద్ర శేఖర్ రెడ్డిని మల్దకల్ మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి గద్వాల ఆసుపత్రికి తరలించారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో జడ్పీ చైర్ పర్సన్ సరితా తిరుపతయ్య స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత ఒకటిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు రెండు గ్రూపులుగా విడిపోయారు. గ్రూపులుగా విడిపోయి ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య విభేదాలు రావడంతో గొడవలకు దారి తీసినట్టు తెలుస్తోంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement