Monday, April 29, 2024

Gadwala : 30పాఠశాలలను దత్తత తీసుకోనున్న మంచు లక్ష్మీ… కలెక్టర్ తో చర్చలు

జోగులాంబ గద్వాల (ప్రతినిధి), జూన్ 28 (ప్రభ న్యూస్) : టీచ్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జోగులాంబ గద్వాల జిల్లాలోని 30 ప్రభుత్వ పాఠశాలలను మెరుగైన విద్యను అందించేందుకు దత్తత తీసుకునేందుకు ఆ సంస్థ ఫౌండర్, సినీనటి లక్ష్మీ మంచు ముందుకు వచ్చినట్లు సమాచారం‌. గద్వాలకు చేరుకున్న లక్ష్మీ మంచు జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతితో సమావేశమయ్యారు. కలెక్టర్ ను కలిసిన అనంతరం లక్ష్మి మంచు మీడియాతో మాట్లాడుతూ… జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ విద్య, కంప్యూటర్ క్లాస్ తదితర మౌళిక వసతులు కల్పించనున్నట్లు తెలిపారు.

జోగులాంబ గద్వాల జిల్లాలో 30 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని అభివృద్ధి చేయడానికి బుధవారం జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతితో ఒప్పందం చేసుకోవడం జరిగిందని, ఆయా పాఠశాలలకు డిజిటల్ బోధన కోసం ఇప్పటికే మెటీరియల్ సిద్ధం చేసినట్లు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 56 పాఠశాలలను దత్తత తీసుకొని ఇప్పటికే విజయవంతం చేయడం జరిగిందన్నారు. వెనుకబడిన జిల్లాలను ఎంచుకొని ఈ కార్యక్రమాలు తమ స్వచ్చంద సంస్థ ద్వారా అభివృద్ధి చేపట్టడం జరుగుతుందని, అందులో భాగంగా గద్వాల జిల్లాకు రావడం జరిగిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement