Sunday, May 19, 2024

MBNR: కృష్ణానీటిని ఏపీకి కట్టబెట్టింది కేసీఆర్ సర్కారే…ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి..

మహబూబ్ నగర్, ఫిబ్రవరి 7(ప్రభ న్యూస్): ప్రాజెక్టు పేరుతో గత కేసీఆర్ ప్రభుత్వం ప్రజల సంపదను దోపిడి చేసిందని డీసీసీ అధ్యక్షుడు, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

తెలంగాణలో కృష్ణానది పరివాహక ప్రాంతం 68శాతం ఉంటే, ఏపీలో 32 శాతం మాత్రమే ఉందని, కాని కృష్ణానది నీటి కేటాయింపులో కేవలం తెలంగాణకు 299 టీఎంసీల నీళ్లకే గత ప్రభుత్వంలో కేసీఆర్ ఒప్పుకున్నారని విమర్శించారు. ఏపీ ప్రభుత్వం కృష్ణానీళ్లను అక్రమంగా దోచుకెళుతున్నా పట్టించుకోలేదని విమర్శించారు. 16వ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో బీఆర్ఎస్ అధికారంలో ఉన్పప్పుడూ కృష్ణారివర్ మేనేజ్మెంట్ బోర్డు ప్రాజెక్టులను తీసుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరాలు లేదని తీర్మానం చేసింది మీరేకదా అని ప్రశ్నించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement