Monday, October 7, 2024

MBNR: ఎమ్మెల్యేలకు ఘన సన్మానం

మక్తల్, డిసెంబర్ 6 (ప్రభ న్యూస్) : నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలను మక్తల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఇవాళ‌ సాయంత్రం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్లో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ పర్ణికా రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి (జిఎంఆర్), వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి తో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షుడు కుంభం శివకుమార్ రెడ్డిలను బీకేఆర్ ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ మక్తల్ నియోజకవర్గ నాయకులు గవినోళ్ళ బాలకృష్ణారెడ్డి, జి.గోపాల్ రెడ్డి, టీపీసీసీ ఎలక్షన్ కాంపైనర్ కన్వీనర్ బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డిలు కలుసుకుని శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధికి పెద్దపీట వేయాలని, ఒక విధంగా నిధులు తీసుకురావాలని ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు విష్ణువర్థన్ రెడ్డి, అనిల్ కుమార్, తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement