Sunday, April 28, 2024

KNL: ప్రజల ఆస్తులకు భద్రత లేని ఏపీ భూ హక్కుల చట్టం రద్దు చేయాలి

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన ప్రజల ఆస్తులకు భద్రత లేని ఏపీ భూహక్కు చట్టం 27/ 2023లో రద్దు చేయాలని చేయాలని కర్నూలులో న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. అంతకుముందు కరపత్రాలు రైతులకు పంచుతూ ర్యాలీ నిర్వహించారు.

అనంతరం ర్యాలీలో పాల్గొన్న న్యాయవాదులను ఉద్దేశించి న్యాయవాదుల సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో ప్రజల ఆస్తులకు భద్రత లేని భూ హక్కుల చట్టం తీసుకొచ్చి ల్యాండ్ టైటిలింగ్ యాక్టు అనే పేరుతో న్యాయస్థానం సివిల్ కోర్టు పరిధి కేసులన్నింటినీ ట్రిబ్యునల్ పేరు మీద జిల్లా స్థాయిలో ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి, సివిల్ కేసులన్నీ ట్రిబ్యునల్ లో వేసుకొని కేసు వేసిన వ్యక్తికి అభ్యంతరాలు ఉంటే హైకోర్టుకి ఆపిల్ పోయే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టం తీసుకురావడం జరిగిందన్నారు. ఈ చట్టం వలన సామాన్యమైన మానవునికి చాలా నష్టం జరుగుతుందని, తక్షణమే ఈ చట్టం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రద్దు చేయని పక్షంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వివిధ రకాల ఉద్యమాలు చేస్తామని తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement