Saturday, May 18, 2024

తండ్రికి కరోనా టీకా వేసిన కుమారుడు..

అమరచింత : మున్సిపాలిటీ డి.ఎన్.ఆర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తండ్రికి కరోనా టీకా వేశాడు కుమారుడు డాక్టర్ అక్షయ్. ఈ సందర్భంగా డాక్టర్ అక్షయ్ మాట్లాడుతూ దేశంలో.. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుండటంతో ప్రజలు ప్రతి ఒక్కరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. కరోనా పట్ల జాగ్రత్తలు తీసుకుంటే కరోనా వైరస్ ను కట్టడి చేయొచ్చన్నారు. కరోనా వచ్చిన వారు వైద్యులు చెప్పిన విధంగా పాటిస్తే వైరస్ నుండి పూర్తిగా కోలుకుంటారు. ఎలాంటి భయం పడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండండి అన్నారు. అదేవిధంగా కరోనా వ్యాక్సిన్ ప్రతి ఒక్కరూ వేయించుకోవాలి.. కరోనా వ్యాక్సిన్ వేసుకున్న ప్రతి ఒక్కరు ఇరవై ఎనిమిది రోజులకు మళ్లీ సెకండ్ డోస్ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. కరోనా నివారణకు చర్యలు మాస్కులు తప్పనిసరిగా ధరించాలి.. భౌతిక దూరాన్ని పాటించాలన్నారు. కరోనా నివారణకు ప్రజలు సహకరించాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement