Tuesday, June 18, 2024

మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా పంటల సాగు చేసుకోవాలి : మంత్రి నిరంజ‌న్ రెడ్డి

వ‌న‌ప‌ర్తి : నూనెగింజలు, పప్పుగింజలు, ఉద్యానపంటలతో రైతులకు అధిక ఆదాయం స‌మ‌కూరుతుంద‌ని, మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా పంటల సాగును ఎంపిక చేసుకోవాలని రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి సూచించారు. పెద్ద మందడి మండలం చిన్నమందడి గ్రామంలో నాలుగు ఎకరాలలో సీతాఫలం తోటను సాగు చేసిన రైతు శ్రీకాంత్ రెడ్డి సీతాఫలాలను శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రికి అందజేశారు. ప్రత్యామ్నాయ పంటను సాగుచేసిన రైతును మంత్రి అభినందించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ… రైతులు లాభసాటి వ్య‌వ‌సాయం వైపు దృష్టి సారించాల‌ని, సాంప్ర‌దాయ సాగు నుంచి రైతాంగం బ‌య‌ట‌కు రావాల‌ని పిలుపునిచ్చారు. నగరాలు, పట్టణాల సమీపంలోని రైతులు కూరగాయల సాగును ప్రణాళికాబద్ధంగా ఎంపిక చేసుకోవాల‌ని చెప్పారు. ఉద్యానశాఖ ద్వారా సబ్సిడీపై నాణ్యమైన కూరగాయల నారు అందించడం జరుగుతున్నదని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement