Saturday, March 23, 2024

హరి హర వీరమల్లు షూటింగ్ లో జాయిన్ అయిన.. బాబీ డియోల్

దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న చిత్రం హరి హర వీరమల్లు. మెగా సూర్య ప్రొడ‌క్షన్ బ్యాన‌ర్‌పై ఏ. ద‌యాక‌ర్ రావు అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. పాన్‌ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎమ్‌. ఎమ్ కీర‌వాణి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే చిత్ర బృందం రిలీజ్‌ చేసిన పోస్టర్‌లు, గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది.ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రని పోషిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా సెట్స్‌లోకి బాలీవుడ్‌ స్టార్‌ నటుడు బాబీ డియోల్‌ అడుగుపెట్టాడు. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌లో బాబీ డియోల్‌పై సన్నివేశాలు చిత్రీకరించనున్నారట. ఈ చిత్రంలో బాబీ ఔరంగజేబు పాత్రలో నటించనున్నట్లు సమాచారం. కాగా ముందుగా ఈ పాత్రను అర్జున్‌ రామ్‌పాల్‌ చేయాల్సి ఉంది. అయితే పవన్ కళ్యాణ్‌కు పొలిటికల్‌ కమిట్‌మెంట్స్‌ ఉండటంతో షూటింగ్‌ ఆలస్యమవుతూ వచ్చింది. ఈ క్రమంలో అర్జున్‌ రామ్‌పాల్‌ ఈ సినిమా నుండి తప్పుకున్నాడు. ఇక ఆయన ప్లేస్‌లో క్రిష్‌ బాబీ డియోల్‌ను తీసుకొచ్చాడు.పదిహేడవ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్‌షాహీల కాలం నాటి కథాంశంతో క్రిష్ ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. ఈ చిత్రంలో పవన్‌కు జోడీగా నిధి అగ‌ర్వాల్, న‌ర్గీస్ ఫ‌క్రి న‌టిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement