Thursday, April 25, 2024

జీహెచ్ఎంసీ కౌన్సిల్ స‌మావేశంలో గంద‌ర‌గోళం..

హైదరాబాద్ జీహెచ్ఎంసీ ప్రత్యేక బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగానే టెన్షన్ వాతావరణం ఏర్పడింది. కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. బీజేపీ కార్పొరేటర్లు మేయర్ విజయలక్ష్మీ పోడియాన్ని చుట్టుముట్టిన సమావేశాన్ని అడ్డుకున్నారు. మేయర్ కు వ్యతిరేకంగా బీజేపీ కార్పొరేటర్లు నినాదాలు చేశారు. అనంతరం నగరంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, కాంట్రాక్ట్ పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. గందరగోళం మధ్యనే వార్షిక బడ్జెట్ ను మేయర్ గద్వాల విజయలక్ష్మీ ఆమోదించారు. రూ.6,224 కోట్ల బడ్జెట్ ను మేయర్ ఆమోదించారు. అయితే ఎటువంటి చర్చ లేకుండానే ఆమోదించడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్లకార్డులు పట్టుకుని నిరసనకు దిగిన సభ్యులను బయటకు పంపాలని మేయర్ మార్షల్స్ కు ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement