Tuesday, October 8, 2024

MBNR: బీజేపీ అభ్యర్థిని గెలిపించాలి.. రోడ్ షో లో పాల్గొన్న ఈటెల

ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో నేతలు ప్రచారాల్లో స్పీడ్ పెంచారు. ఈసందర్భంగా బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు. మహబూబ్ నగర్ నియోజకవర్గం హన్వాడ మండల కేంద్రంలో నిర్వహించిన రోడ్ షో లో ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. స్థానిక బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ నిర్వహించిన భారీ ర్యాలీలో ఈటెల రాజేందర్ ఓటర్లను అభ్యర్థించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement