Friday, May 3, 2024

బర్మింగ్ హామ్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు ఘన స్వాగతం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ఇంగ్లాండ్ లోని బర్మింగ్ హామ్ పట్టణంలో జరుగుతున్న ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్ ను పరిశీలించడానికి రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ వెళ్లారు. ఈసంద‌ర్భంగా తెలంగాణ కు చెందిన ఎన్ఆర్ఐ యువకులు, టీఆర్ఎస్ పార్టీ ఎన్ఆర్ఐ విభాగంకు చెందిన నాయకులు, మంత్రి అభిమానులు బర్మింగ్ హామ్ అంతర్జాతీయ విమానాశ్రయంకు భారీగా తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెంట జాతీయ హ్యాండ్ బాల్ ఫెడరేషన్ చైర్మన్ జగన్మోహన్ రావు, స్పోర్ట్స్ చైర్మన్ అల్లపురం వెంకటేశ్వర రెడ్డి, నవీన్, తదితరులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement