Wednesday, October 16, 2024

TS : మాధవీలత జీ..ఆప్ కీ అదాల‌త్ ప్రోగ్రామ్ బాగుంద‌న్న మోదీ

బీజేపీ హైదరాబాద్ లోక్‌సభ అభ్యర్థి మాధవీలతపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ఆమె ఇటీవల ఓ జాతీయ మీడియా నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొని తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దీనిపై మోదీ స్పందించారు.

”మాధవీలతా జీ. మీ ‘ఆప్‌ కీ అదాలత్‌’ ఎపిసోడ్‌ అద్భుతంగా ఉంది. చాలా కీలక అంశాలను మీరు లేవనెత్తారు. అవి ఎంతో తార్కికంగా ఉన్నాయి. మీకు నా శుభాకాంక్షలు” అంటూ మోదీ ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈ ఎపిసోడ్‌ పునఃప్రసారాన్ని అందరూ చూడాలని కోరారు.

- Advertisement -

అస‌దుద్దీన్‌పై పోటీ..

ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని కొంపెల్ల మాధవీలతకు ఈ సారి భాజపా హైదరాబాద్‌ టికెట్‌ను కేటాయించింది. ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీపై ఆమె పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు కేంద్రం వై-ప్లస్‌ కేటగిరీ భద్రత కల్పించింది. లతామా ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌గా ఉన్న ఆమె.. హైదరాబాద్‌ ఓల్డ్‌ సిటీలో తొమ్మిదేళ్లుగా సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement