Monday, December 9, 2024

United Nations : డిజిటలైజేషన్ భేష్…. ఐరాస అధ్యక్షుడు ప్రావిన్స్​ ప్రశంసలు

పేదరిక నిర్మూలన, కోట్లాది మంది ప్రజలను ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం చేయడంలో భారత్‌ పనితీరు అద్భుతమని ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ అధ్యక్షుడు డేనిస్‌ ఫ్రాన్సిస్‌ కొనియాడారు. అందుకోసం డిజిటలైజేషన్‌ను సమర్థంగా వినియోగించుకుంటోందని అన్నారు.

- Advertisement -

ఫోన్‌ లాంటి ఒక డివైజ్‌, డిజిటలైజేషన్‌ మోడల్‌తోనే ఇది సాధ్యమవుతోందని పేర్కొన్నారు. ఉత్పాదకతను పెంచడం, ఖర్చును తగ్గించడం, ఆర్థిక వ్యవస్థను సమర్థంగా మార్చడంలో డిజిటలీకరణ తోడ్పాటునందిస్తుందన్నారు.

డిజిటలైజేషన్​ని కళ్లారా చూశాం..
జనవరి 22-26 మధ్య ఫ్రాన్సిస్‌ భారత్‌లో పర్యటించారు. విదేశాంగ మంత్రి జైశంకర్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. జైపుర్‌, ముంబయిలో పర్యటించారు. పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు, మేధోసంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పరిశీలించిన అంశాలను ఆధారం చేసుకొని డిజిటలైజేషన్‌ వినియోగంతో భారత్‌ సాధిస్తున్న పురోగతిని ప్రశంసించారు. మహిళలు, రైతుల నుంచి ప్రతిఒక్కరూ తామున్న చోటు నుంచే చెల్లింపులు చేస్తున్నట్లు గుర్తించామని ఆయన చెప్పారు. దీంతో ప్రపంచ వేదికపై భారత పోటీతత్వం పెరుగుతోందని కొనియాడారు.

మెరుగైన వసతులు.. కార్మికుల ఉపాధి..
దేశవ్యాప్తంగా మౌలిక వసతుల సదుపాయాల్లోనూ భారత్‌ గణనీయంగా పెట్టుబడులు పెడుతున్నట్లు గమనించామని ఫ్రాన్సిస్‌ తెలిపారు. దీంతో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. కార్మికులకు నిరంతరం పని లభిస్తుందని చెప్పారు. వివిధ వస్తువులకు గిరాకీ పుంజుకుంటుందన్నారు. తద్వారా ఆర్థిక వ్యవస్థ గణనీయ వృద్ధి నమోదు చేస్తుందని తెలిపారు. అయితే, మౌలిక వసతుల అభివృద్ధిని పర్యావరణ అనుకూల విధానాలతో ముడిపెట్టాలని సూచించారు. లేదంటే భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా పరిణమిస్తుందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement