Friday, May 3, 2024

TS | గోస తీర్చే జీవధార.. 16న ‘పాలమూరు’ ప్రారంభోత్సవం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: వలసలతో తల్లడిల్లి పడావు పడ్డ పాలమూరు జిల్లాలను పచ్చగా చేస్తోంది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు అని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ  రామారావు అన్నారు. ప్రతి సంవత్సరం లక్షాది మంది పాలమూరు ప్రజలు వలసలు పోయో పరిస్థితిని ఈ ప్రాజెక్టు తీరుస్తోందన్నారు. ఈనెల 16న జరిగే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమాల ఏర్పాట్లను మంత్రి కేటీఆర్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ పాలమూరుతో పాటుగా రంగారెడ్డి జిల్లా భూములకు సాగునీరు, ప్లోరైడ్‌ ప్రాంతాల్లో తాగునీరు ఈ ప్రాజెక్టు అందివ్వనుందన్నారు. గోదావరిలో కాళేశ్వరం, కృష్ణాలో పాలమూరు రంగారెడ్డి లాంటి గొప్ప ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం కట్టిందని చెప్పారు.

సీతారామ ప్రాజెక్టు ను కూడా పూర్తి చేస్తే తెలంగాణ సాగునీటి రంగంలో సంతృప్తి కరంగా ప్రాజెక్టులు ఉంటాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ నాయకత్వంలో కట్టిన ప్రాజెక్టును చూసి కేవలం తెలంగాణ బిడ్డగానే కాకుండా భారతదేశపౌరుడిగా గర్వంగా ఉందన్నారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణం వెనుక 2001 నుంచి కన్న తెలంగాణ ప్రజల కలలున్నాయన్నారు, పాలమూరు రంగారెడ్డి ప్రజలు పడిన కష్టాలను తీర్చే గొప్ప ప్రాజెక్టు ఇదన్నారు. అనేక అడ్డంకులను దాటుకుని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పట్టుదలతో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేశారని చెప్పారు. రైతుల పొలాలకు సాగునీటితో పాటు, రాజదాని ప్రజ తాగునీటి అవసరాలు, పరిశ్రమల అవసరాలను ఈ ప్రాజెక్టు తీర్చనుందన్నారు.

16వ తేదీన జరిగే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవం తెలంగాణ చరిచత్రలో మైలు రాయిగా నిలిచిపోతోందన్నారు. ఇంతగొప్ప సందర్భాన్ని మరింత గొప్పగా నిర్వహించాలని చెప్పారు. ప్రాజెక్టు విశిష్టత ప్రజలకు తెలిసే విధంగా గొప్ప సంబరాలు చేసుకోవాలని కేటీఆర్‌ పీలుపునిచ్చారు. కనీసం లక్షన్నర మంది రైతులతో ప్రారంభోత్సవం సభ ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ప్రారంబోత్సవానికి సంభంధిచిన ఏర్పాట్లపైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి , సంబంధిత మంత్రులు, అధికారులతో మంత్రి కేటీఆర్‌ చర్చించారు. ఈ సమీక్ష సమావేశంలో మహబూబ్‌ నగర్‌ జిల్లామంత్రులు నింరంజన్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాతోడ్‌, సంబంధిత శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement