Wednesday, May 1, 2024

LIVE from Secretariat – మందిర్,మసీదు,చర్చి పున:ప్రారంభ కార్యక్రమం …

https://youtu.be/tqT8wrPbwPU

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : సచివాలయం ప్రాంగణంలో నిర్మితమైన దేవాలయం, మసీద్‌, చర్చి మ‌రికొద్దిసేప‌టిలో సీఎం కేసీఆర్‌ మీదుగా ప్రారంభం కానున్నాయి. తెలంగాణ పరిపాలనా సౌధం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయం సర్వమత సమ్మేళనానికి అత్తం పట్టనున్నది. సచివాల యం ఆవరణలో కొత్తగా ఈ మూడు నిర్మాణాలు పూర్తయ్యాయి. సచివాలయం ఆవరణలో నిర్మించిన ఆలయంలో శివుడు, గణపతి, పోచమ్మ, హనుమంతుడి ఆలయాలున్నాయి. ఆయా దేవుళ్ల విగ్రహాలను తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర శిల్ప కళాశాల నుంచి ప్రత్యేకంగా ఆయరు చేయించి తెప్పించారు. కాగా, గుడి, మసీదు, చర్చిలను సచివాలయంతోపాటే ప్రారంభించాలని భావించినా నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో సాధ్యంకాలేదు. ఆగష్టు 25నాటికి ప్రారంభించాలని భావించినా అనివార్యంగా కొన్ని పనులు పెండింగ్‌లో పడటంతో నిల్చిపోయింది. హిందూ సాంప్రదాయాలను అనుసరించి పూజారుల సమక్షంలో నల్ల పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన చేసి దేవాలన్ని నేడు పున:ప్రారం భించనున్నారు. ఆ తర్వాత ఇస్లాం, క్రిస్టియన్‌ మతాల సాంప్రదా యాల మేరకు ఆయా మత పెద్దల సమక్షంలో మసీదు, చర్చిలను ప్రారంభిస్తారు.

తెలంగాణ పాత సచివాలయ ప్రాంగణంలో ఉన్న ప్రార్ధనా మందిరాలను తెలంగాణ సర్కార్‌ నూతన సచివాలయ నిర్మాణం తర్వాత పున:నిర్మించింది. గతంలో తెలంగాణ పాత సచివాల యంలో నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయం, రెండు మసీదులు, చర్చి ఉండేవి. పాత భవనాల కూల్చివేతల సమయంలో ప్రార్ధనా మందిరాలకు నష్టం వాటిళ్లడంతో ప్రభుత్వ ఖర్చుతోనే పున:నిర్మి స్తామని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగా సచివా లయ ప్రధాన భవన ప్రాంగణం వెలుపల మూడు నిర్మాణాలను నిర్మించారు. సచివాలయానికి నైరుతి మూలలో నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయం విశాలంగా నిర్మించారు. ప్రధాన ఆలయంలో భాగంగా గర్బగుడి, మహామండపం నిర్మించారు. నల్లపోచమ్మ ఆలయంతోపాటు శివాలయం, ఆంజనేయ స్వామి ఆలయం, గణపతి, సుబ్రహ్మన్య స్వామి ఆలయనాలను కూడా నిర్మించారు.

పాత సచివాలయం ప్రాంగణంలోని దేవాలయంలోని నల్ల పోచమ్మ అమ్మవారి విగ్రహాన్ని చిక్కడపల్లిలోని ఓ ఆలయంలో ఉంచి పూజలు జరిపారు. ప్రారంభోత్సవ వేళకు కొత్త ఆలయంలో పున:ప్రతిష్ట చేయనున్నారు. ఇక మసీద్‌ ఏ మోతేమది, మసీద్‌ ఏ హ్ష్తితోపాటు ఇమామ్‌ నివాసాన్ని నిర్మించారు. ఇవి సచివాలయానికి పశ్చిమభాగాన ఉన్నాయి. మసీదులకు సమీపంలోనే చర్చిని నిర్మించారు. ఆలయ కమిటీకి చైర్మన్‌గా సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్‌రావు, మసీదులకు గౌరవ అధ్యక్షుడిగా యూసుఫ్‌, అధ్యక్షుడిగా ఆయూబ్‌ఖాన్‌ ఉన్నారు. చర్చి కమిటీకి ఆర్ధిక శాఖ అదనపు కార్యదర్శి రాయి రవి చైర్మన్‌గా, జీఏడీ ఎస్‌వో చిట్టిబాబు ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement