Wednesday, May 1, 2024

బిఆర్ఎస్ తో పొత్తుకు లెఫ్ట్ పార్టీలు సై – సీట్ల‌ సర్దుబాట్లకు నై…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ ప్రధాన ప్రతినిధి: రాష్ట్రంలో వామపక్ష పార్టీల పరిస్థితి రెండడుగులు ముందుకు నాలుగడుగులు వెనక్కు అన్న చందాన ఉంది. ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు లేకుండానే ఒంటరిగానే బరిలోకి దిగా లా లేక అధికార పార్టీ భారత రాష్ట్ర సమితి(భారాస)తో సీట్ల సర్దుబాటు- చేసుకుని ముందుకెళ్లాలా అనే విష యంలో ఎటూ తేల్చుకోలేకపోతోంది. వామపక్షాలతో పొత్తులు పెట్టు-కోకుండా అవగాహన మాత్రమే కుదు ర్చుకోవాలని భారాస అధినేత ఒక నిర్ణయానికి వచ్చి నట్టు- రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. శాస నమండలి సభ్యుల ఎంపికలో వామపక్షాలకు అవకా శమిచ్చే యోచనలో కేసీఆర్‌ ఉన్నారన్న సంకే తాలు వెలువడడంతో లెప్ట్‌n పార్టీలు తమ దారి తాము చూసు కునేందుకు సమాయత్తం అయినట్టు- సమా చారం. రెండు రోజుల పాటు- వామపక్ష అగ్ర నేతలు ఇక్కడ సమావేశమై తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. సీట్ల సర్దుబాటుకు భారాస కలిసి రాకపోతే ఒంటరి పోరుకు సిద్ధం కావా లన్న ప్రతి పాదనపై సమాలోచనలు జరిపినట్టు- అత్యం త విశ్వస నీయ వర్గాలు చెబుతున్నాయి. ఆ పార్టీ ఎన్ని సీట్లు ఇవ్వ వచ్చన్న చర్చ వామపక్ష పార్టీల నేతల్లో జరుగుతోంది.


గత ఏడాది జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో భారాస నిలబెట్టిన మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభా కర్‌రెడ్డికి మద్దతు ప్రకటించడంతో పాటు- ఆయన గెలుపునకు సీపీఐ, సీపీఐ(ఎం) పార్టీల రాష్ట్ర నేతలు, నల్గొండ జిల్లా నేతలు ప్రచారంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా నియోజకవర్గంలో భారాస నిర్వహించిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తోసహా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, మరో అగ్ర నేత చాడా వెంకట్‌ రెడ్డి, సీపీఐ(ఎం)రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పాల్గొనడంతో పాటు- భవిష్యత్తులో జరిగే ఏ ఎన్నికల్లోనైనా భారాసతో కలిసి వెళ్తామన్న సంకేతా లిచ్చారు. ఇదే సభలో ప్రసంగించిన సీఎం కేసీఆర్‌ సైతం వామపక్ష పార్టీలతోనే తమ పయనమంటూ చెప్పారు. వామపక్ష పార్టీల అధినాయకత్వాల అగ్ర నేతల అభీష్టం ఇలా ఉంటే జిల్లా స్థాయి నేతలు ఇందు కు భిన్నంగా వ్యవహరిస్తుడడం పార్టీ నేతలకు మింగు డుపడడం లేదన్న ప్రచారం జరుగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక, భద్రాచలం నియోజక వర్గాల్లో పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ఇటీవల నిర్వహించిన హాత్‌ సే హాత్‌ జోడో యాత్రలో సీపీఐ నేతలు పాల్గొ నడం, యాత్రకు మద్దతు ప్రకటించడం ఇరు పార్టీల్లో చర్చకు దారితీశాయి. సీపీఐకి చెందిన పలువురు నేతలు రేవంత్‌తో కలిసి నడవడంతో పాటు- పోడు భూ ముల సమస్య, పట్టాల పంపిణీ, రైతులు పడుతున్న ఇబ్బందులు, తదితర సమస్యలపై చర్చించినట్టు- సమాచారం.


కోరినన్ని స్థానాలు ఇచ్చేనా?
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఉభయ వామపక్ష పార్టీలు భారాసతో సీట్ల సర్దుబాటు- చేసుకుని కనీసం 15 స్థానాల్లో పోటీ- చేయాలని ఉవ్విళ్లూరుతున్నట్టు- సమా చారం. కనీసం చెరో ఐదేసి స్థానాలన్నా దక్కించు కునె లా పట్టు- బట్టి సాధించాలన్న పట్టు-దలతో ఉన్నట్టు- ఆ పార్టీల ముఖ్యనేతలు చెబుతున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో చెరో రెండు పార్లమెంట్‌ స్థానాలలో పోటీ-కి దిగాలని కూడా ప్రతిపా దించినట్టు- సమాచారం. సీట్ల సర్దుబాటు- విష యంలో ఎన్నికల నాటి దాకా వేచి చూడడం మంచిది కాదన్న అభిప్రాయంతో వామపక్ష నేతలు ఉన్నారన్న చర్చ జరుగుతోంది.

కొత్తగూడెం, హుస్నాబాద్‌, మలక్‌పేట లేదా ఎల్బీనగర్‌, బెల్లంపల్లి, దేవరకొండ లేదా మునుగోడు స్థానాల్లో పోటీ- చేయాలని సీపీఐ ఒక నిర్ణయానికి రాగా భద్రాచలం, ఖమ్మం లేదా పాలేరు, నల్గొండ లేదా మిర్యాలగూడ, నకిరేకల్‌, డోర్నకల్‌ లేదా మహబూబాబాద్‌, ఇబ్రహీంపట్నం లేదా మేడ్చల్‌ సీట్లలో పోటీ-కి సీపీఐ(ఎం) తహతహ లాడుతున్నట్టు- సమాచారం. లోక్‌సభ ఎన్నికల్లో సీపీఐ మహబూబా బాద్‌, నల్గొండ లేదా భువనగిరి నియోజకవర్గాలను కోరే అవ కాశం ఉండగా ఖమ్మం, చేవెళ్లలలో పోటీ-కి సీపీఐ(ఎం) ప్రణాళిక సిద్ధం చేసుకునే పనిలో ఉన్నట్టు- సమాచారం.
భారాస కోరినన్ని అసెంబ్లీ సీట్లు- ఇవ్వకపోతే ఇతర ప్రత్యామాయ మార్గాలను వెతుక్కోవాలని, భాజ పాను నిలువరించే పార్టీలకు సన్నిహితం కావాలన్న నిర్ణయానికి సీపీఐ, సీపీఎం పార్టీల ముఖ్యులు వచ్చారని సమా చారం. ఒకవేళ ఇదీ జరగని పక్షంలో రెండు వామపక్ష పార్టీలు ఒక అవగాహనకు వచ్చి కీలక స్థానాలలో అభ్యర్థులను ఎంపిక చేయాలని, ఎక్కడా ఒకరిపై మరొకరు అభ్యర్థులను పోటీ-కి పెట్టకుండా ముందే ఒక అంగీకారానికి రావాలని ఉభయ కమ్యూనిస్టు పార్టీల నేతలు నిర్ణయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement