Thursday, April 18, 2024

భారీగా బ‌రువు పెరిగిన అనుష్క‌.. షాక్ లో ఫ్యాన్స్

స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి లుక్ చూసి అవాక్క‌వుతున్నారు ఆమె ఫ్యాన్స్. బాగా బరువు పెరిగిపోయిన అనుష్కను చూసి అయ్యో పాపం అంటూ షాక్ అవుతున్నారు. కొన్ని రోజులుగా బయటికి రాని జేజమ్మ.. తాజాగా శివరాత్రి సందర్భంగా కుటుంబంతో పాటు కర్ణాటకలోని ఓ శివాలయానికి వచ్చింది. అక్కడే ప్రత్యేక పూజలు నిర్వహించింది. అక్కడి వరకు బాగానే ఉంది కానీ అక్కడున్నది అనుష్క అని గుర్తు పట్టడానికి కూడా కాసేపు అయ్యేంతగా మారిపోయింది జేజమ్మ. అమ్మో ఏంటిలా అయిపోయింది అంటూ ఆమె వీరాభిమానులు షాక్ అవుతున్నారు. ఈమెను ఇలా చూశాక.. ఒకప్పటి లుక్‌లోకి రావడం కష్టమే అని డిసైడ్ అయిపోతున్నారు . అయితే ఈమె ఇంతలా వెయిట్ పెరగడానికి కారణం థైరాయిడ్ అనే ప్రచారం జరుగుతుంది. అందులో ఎంతవరకు నిజం ఉందనేది మాత్రం అనుష్కనే తేల్చాలి. ప్రస్తుతం నవీన్ పొలిశెట్టి హీరోగా మహేశ్‌ బాబు తెరకెక్కిస్తున్న సినిమాలో నటిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement