Wednesday, April 24, 2024

బిజెపి నేత‌ల‌లో స్ట్రీట్ కార్న‌ర్ ద‌డ‌…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ”ప్రజా గోస- బీజేపీ భరోసా” పేరుతో బీజేపీ తెలంగాణ వ్యాప్తంగా చేపడు తున్న స్ట్రీట్‌ కార్నర్‌ సమావేశాల అనంతరం పార్టీలో సంస్థాగత మార్పులు చోటుచేసుకోనున్నాయని ఆ పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు. స్ట్రీట్‌ కార్నర్‌ సమా వేశాలను సమర్థంగా, విజయవంతంగా నిర్వహించని పార్టీ జిల్లా, మండల, నియోజకవర్గ అధ్యక్షులు, ఇతర ముఖ్య పదవుల్లో ఉన్న వారికి ఉద్వాసన తప్పదన్న సంకేతాలు పార్టీ అధినాయకత్వం నుంచి వెలువ డుతు న్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా స్ట్రీట్‌ కార్నర్‌ సమావేశాలు జరుగుతున్న తీరును బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జిలు తరుణ్‌చుగ్‌, సునీల్‌ బన్సల్‌ తోపాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, సమా వేశాల సమన్వయకర్త కాసం వెంకటేశ్వర్లు యాదవ్‌ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.

ఏరోజుకారోజు నిర్వహించిన స్ట్రీట్‌ కార్నర్‌ సమావేశాలపై పార్టీ రాష్ట్ర నాయకత్వం నివేదిక తెప్పించుకుంటోంది. ఏ నియోజ కవర్గంలో సమావేశాలు స్పీడ్‌గా, సమర్థంగా నిర్వ హిస్తున్నారు..? తదితర అంశాలను సునీల్‌ బన్సల్‌ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్టీ ప్రతినిధుల ద్వారా తెలుసుకుంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఈ నెల 10న మొదటి రోజు ఉప్పల్‌ నియోజకవర్గంలో సమావేశాలను ప్రారంభించకపోవడంతో ఆ నియో జకవర్గ, ఆ జిల్లా నేతలపై సునీల్‌ బన్సల్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, నియోజకవర్గాల్లో కలిపి 11వేల స్ట్రీట్‌ కార్నర్‌ సమావేశాలను నిర్వహించాలని బీజేపీ నిర్ణయిం చింది. ఈ నెల 10 నుంచి ప్రారంభమైన స్ట్రీట్‌ కార్నర్‌ సమావేశాలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 25వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంతోపాటు క్యాడర్‌ను ఎన్నికలకు సంసిద్ధం చేయడం, ప్రజా సమస్యలను తెలుసుకోవడం, స్థానిక నాయకత్వాన్ని వృద్ధి చేయడం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికీ ప్రచారం చేయడం తదితర పలు లక్ష్యాల సమాహారంగా స్ట్రీట్‌ కార్నర్‌ సమావేశాలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో తమ జిల్లాలో, నియోజకవర్గంలో, మండలంలో సమా వేశాలను విజయవంతం చేయలేని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారికి మార్చి చివరినాటికి ఉద్వాసన తప్పదని బీజేపీ ముఖ్యనేతలు చెబుతున్నారు. ఈ నెల 25 తర్వాత సమావేశాల నిర్వహణ విషయంలో నేతల పనితీరును మదింపు చేసి ఫలితాల ఆధారంగా నాలుగైదు జిల్లాల పార్టీ అధ్యక్షులు, పలు మండలాల బాధ్యులను మార్చే అవకాశాలు ఉన్నాయని బీజేపీ కీలక నేత ఒకరు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement