Sunday, April 28, 2024

HYD: లాలాగూడ సీఐ సస్పెండ్..

తార్నాక, ఏప్రిల్ 3 (ప్రభ న్యూస్): విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు లాలాగూడ పోలీసు స్టేషన్ ఇన్ స్పెక్ట‌ర్ పల్లె పద్మను హైదరాబాద్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేశారు. ఇటీవల లాలాగూడ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఓ యాచకురాలి యాక్సిడెంట్ కేసులో ఇన్ స్పెక్ట‌ర్ పల్లె పద్మ సెక్షన్ 174 కింద కేసు నమోదు చేశారు.


యాక్సిడెంట్ కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ లభ్యమైనా కూడా.. ఇందుకు బాధ్యుడైన వ్యక్తిపై 304 సెక్షన్ కింద కేసు నమోదు చేయలేదు. ఈ విషయంపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపట్టి విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. కాగా లాలాగూడ పోలీసు స్టేషన్ ఇన్చార్జిగా చిలకలగూడ పోలీసు స్టేషన్ డిఐ రమేష్ గౌడ్ కు బాధ్యతలు అప్పగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement