Tuesday, April 16, 2024

KTR : నందినగర్ లో ఓటు హక్కును వినియోగించుకున్న కేటీఆర్

మంత్రి కేటీఆర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్ లోని నందినగర్‌లో మంత్రి కేటీఆర్ దంప‌తులు త‌మ ఓట్ల‌ను వేశారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ… ఒక బాధ్యత గల పౌరుడిగా తాను ఓటు హక్కును వినియోగించుకుని తన బాధ్యతను నిర్వహించానని చెప్పారు. అభివృద్ధి కోసం పాటు పడే పార్టీకి, ఒక మంచి నాయకుడికి ఓటు వేశానని చెప్పారు. అందరూ కూడా బయటకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు ఓటు వేయాడానికి బయటకు రావాలని కోరారు. నగర ప్రజలు బయటకు వచ్చి నచ్చిన నాయకుడికి, నచ్చిన పార్టీకి ఓటు వేయాలని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement