Thursday, May 2, 2024

TS : జ‌న‌గామ‌లో బీఆర్ఎస్‌, బీజేపీ వ‌ర్గీయుల ఘ‌ర్ష‌ణ‌..ఖండించిన నేతలు

జనగామ పోలింగ్ కేంద్రం వద్ద బిజెపి, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు బహి బాయ్ గురువారం జనగామ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాల గౌట్ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో బీఆర్ఎస్ అభ్యర్థి పల్ల రాజేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి తనయుడు కొమ్మూరి ప్రశాంత్ బిజెపి అభ్యర్థి ఆరుట్ల దశమంత్ రెడ్డి వర్గీయులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ప్రయత్నం చేశారు. దీనితో పోలింగ్ కేంద్రాల్లో బార్లు తీరును ఓటర్లకు అంతరాయం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు వారిని చదరగొట్టి అదుపులో తీసుకున్నారు. దీంతో బిఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి వారిని అక్కడి నుండి పిలిపించడంతో మరింత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

ఓటమి భయంతోనే దాడులకు పాల్పడుతున్న ప్రతిపక్ష పార్టీలు… అభ్యర్థి పళ్ళ రాజేశ్వర్ రెడ్డి

జనగామ నియోజకవర్గం లో ప్రతిపక్ష పార్టీలు బిజెపి కాంగ్రెస్ పార్టీలు ఓటమి భయంతోనే దాడులకు పాల్పడుతున్నారని టిఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు గురువారం జనగామ పట్టణంలోని ప్రభుత్వ జడ్పీహెచ్ఎస్ పాఠశాల పోలింగ్ కేంద్రంలో బిజెపి కాంగ్రెస్ వర్గీయులు అభ్యర్థుల ప్రోత్బలంతో ఓటమి భయంతోనే ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసే విధంగా దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నారని ఇది ప్రజాస్వామ్యానికి మంచి సంకేతం కాదని అన్నారు ప్రతిపక్షాలు ఎలాంటి సమస్యలు సృష్టించిన పార్టీ కార్యకర్తలు శ్రేణులు సమన్వయంతో ఉండాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.

ఓడిపోతామని భయంతోనే టిఆర్ఎస్ దాడులకు ప్రేరేపన… కాంగ్రెస్ నాయకులు కొమ్మూరి ప్రశాంత్

జనగామ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుండి ఆదరణ ఓటింగ్ కాంగ్రెస్ వైపు వస్తుందని నెపంతోనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టిఆర్ఎస్ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు స్థానికేతరుడైన పల్లా రాజేశ్వర్ రెడ్డి తన గెలుపు కోసం ఇతర జిల్లాల నుండి ఓట్లు బదిలీ చేసుకొని అక్రమంగా గెలుపొందాలని లక్ష్యం తో పనిచేస్తున్నారని ఓటమి భయంతోనే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు ఎప్పటికైనా జనగామ నియోజకవర్గంలో ప్రజలు స్థానికున్నే గెలిపించుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు

- Advertisement -

ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న టిఆర్ఎస్ …. బిజెపి అభ్యర్థి ఆరుట్ల దశమంత్ రెడ్డి…
జనగామ జిల్లా కేంద్రంలో టిఆర్ఎస్ అభ్యర్థి పల్ల రాజేశ్వర్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా తన అనుచర వర్గంతో శుక్రవారం పోలీస్ స్టేషన్ అతి సమీపంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఉన్న పోలింగ్ కేంద్రంలోకి వచ్చి ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారని ఇదేమని ప్రశ్నిస్తే దాడులు చేసే ప్రయత్నం చేయడం అందుకు పోలీసులు సైతం ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఆయన ఆరోపించారు ఓటర్ కానీ వారు దాడులు చేసే ప్రయత్నం చేసిన వారిని పోలీసులకు అప్పగించిన అధికార పార్టీ నేత బలంతో వారిని వదిలి పెట్టారని పేర్కొన్నారు జిల్లావ్యాప్తంగా టిఆర్ఎస్ నేతలు ప్రజాస్వామ్య విలువలను మరచి వ్యవహరిస్తున్నారని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement