Wednesday, May 1, 2024

కృష్ణాన‌దిలో వివాదాల ప్ర‌వాహం…

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ: కృష్ణా నదితో పాటుగా వివా దాలు ప్రవహి స్తున్నాయి. నది పరివాహక ప్రాంతం అధి కంగా ఉన్న తెలంగాణలో కష్ణా నదీజలాల వాటాలో జరి గిన అన్యాయం పై తెలంగాణ చేస్తున్న అభ్యంతరాలు, ఏపీ చేసిన ఆరోపణలపై కృష్ణా ట్రిబ్యునల్‌ ఈ నెల 18, 19 తేదీల్లో సమావేశం కానుంది. ఈ సమావేశంలో తెలంగాణ గట్టిగా వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతోంది . ప్రస్తుతం ట్రిబ్యునల్‌ అవార్డుమేరకు మహారాష్ట్ర కు 560 టీఎంసీ లు, కర్ణాటక కు 700 టీఎంసీలు , ఉమ్మడి ఏపీకి 811 టీఎం సీల నీటి కేటాయింపులున్నాయి. 1976లో జరిగిన ఈ నదీజలాల పంపకాల్లో ఆనాటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ తెలంగాణ పక్షాన వాదించకపోవడంతో పాటుగా ఏపీకి కేటా యించిన నీటిలో ఏపీ 512 టీఎం సీలు, తెలంగాణకు 299 టీఎంసీలు కేటా యించింది. అలాగే తెలంగాణ లో 299 టీఎంసీల నీటి విని యోగానికి ప్రాజెక్టులు లేకపోవడంతో ఆనీటిని కూడా దాదాపుగా ఏపీ ఉపయోగించుకుని తెలంగాణకు అన్యాయం చేసిందంటూ రాష్ట్ర నీటి పారుదల శాఖ అభ్యంతరం వ్యక్తం చెెస్తోంది. తెలంగాణ రాష్ట్రంగా ఆవిర్భ వించిన అనంతరం కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ప్రాజెక్టులు నిర్మించుకుని వాటాను ఉపయోగించుకోవాలన్నా ఏపీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది.

కృష్ణా నది పరీవాహక ప్రాంతాలను పరిశీలిస్తే తెలంగాణలో 68.50 శాతం పరీ వాహక ప్రాంతం ఉండగా నీటి కేటాయింపుల్లో 299 టీఎంసీలు, ఆంధ్రలో 31.50 శాతం పరీవాహక ప్రాంతం ఉండగా 512 టీఎం సీల కేటాయింపులు ఉన్నాయి. కృష్ణా నదిజలాలపై ఆధారపడిన దక్షిణ తెలంగాణ ను సస్యశ్యామలం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 90 టీఎం సీల సామర్థ్యంతో పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి ఇప్పటికే ఉన్న 45 టీఎం సీలు, పట్టిసీమ నుంచి రావల్సిన 45 టీఎంసీల ను ఆధారం చేసుకుని ఈ ప్రాజెక్టును నిర్మిస్తుంటే ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టుపై అభ్యంతరాలు తెలుపుతూ కృష్ణా యాజమాన్యం బోర్డుకు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో 18న జరగనున్న ట్రిబ్యునల్‌ ముందు తెలంగాణ ఏపీ విధా నాలను ఎండగడుతూ వాదనలు వినిపించేందుకు సిద్ధ మైంది. ఇప్పటికే పాల మూరు రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్‌ ను తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్యం బోర్డుకు సమర్పించింది. అయితే ఈ డీపీఆర్‌ సమర్పించలేదని మొండివాదన వివిపిస్తున్న ఏపీకి సమాధానం చెప్పేందుకు తెలంగాణ నివేదికలను రూపొందిస్తోంది. కృష్ణా నది జలాల పంపకాల్లో రెండు రాష్ట్రాలకు సమన్వయం కుద రడంలేదు. రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో కృష్ణా జలాల వివాదం ముదురుతోంది. అలాగే ఇప్పటివరకు వివియోగించుకోని కృష్ణా జాలాలను వాటాలో చేర్చవద్దని తెలంగాణ డిమాండ్‌ చెెస్తోంది. రాష్ట్రంలో ఉపయోగించుకోని మిగులు జలాలను ప్రస్తుతం యాసం గికి ఉపయోగించుకుంటామని తెలంగాణ పట్టుబడుతోంది.

తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ఏపీ ప్రయ త్నాలు వేగవంతం చేయడంతో తెలంగాణ మండిప డుతోంది. ప్రధానంగా నీటికేటాయింపులు ఉన్న పాల మూరు రంగారెడ్డి, డిండి, భక్తరామదాసు, తుమ్మిళ్ల, కల్వకుర్తి ఎత్తి పోతల, ఎస్‌ఎల్‌బీసీ, నెట్టెంపాడు ప్రాజెక్టులపై కఆర్‌ఎంబీ కి ఏపీ ఫిర్యాదు చేసింది. ఈ ప్రాజెక్టులన్నింటికీ డీపీఆర్‌ లు ఉన్నయనీ, సంబంధింత శాఖలకు డీపీఆర్‌లను సమర్పించినట్లు తెలంగాణ వాదనలు వినిపించనుంది. అయితే నిబంధనలమేరకు, నీటి కేటాయింపులు ఉన్న తెలంగాణ ప్రాజెక్టులను ఏపీ అడ్డుకునే ప్రయత్నం విరమిం చుకోవాలని తెలంగాణ డిమాండ్‌చేస్తోంది. 80వేల క్యూసెక్కుల నీటిని తరలించేందుకు ఏపీ నిర్మిస్తున్న పోతిరెడ్డి పాడు హెడ్‌ రెగ్యూలేటర్‌ సామర్థ్యం పెంపుతోపాటుగా కృష్ణా పరీవాహక ప్రాంతం అవతలకు కృష్ణా నీటిని తరలించేందుకు ఏపీ ప్రాజెక్టులు నిర్మిస్తోందని ఇప్పటికే తెలం గాణ కృష్ణా ట్రిబ్యునల్‌ కు ఫిర్యాదు చేసింది. ప్రధానంగా ఈ నెల 18న జరగనున్న కృష్ణా ట్రిబ్యునల్‌ సమావేశంలో పాలమూరు రంగారెడ్డి, పోతిరెడ్డి పాడు చర్చనీయాంశంకానుండగా తెలంగాణ పట్టువిడవకుండా కృష్ణా జలాల్లో 50 శాతం కోసం పట్టు బిగించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement