Thursday, December 7, 2023

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ స్ఫూర్తికి అనుగుణంగా కేసిఆర్ పాలన… – మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

కమ్మర్ పల్లి,సెప్టెంబర్ 27 ( ప్రభ న్యూస్ ):- కమ్మర్ పల్లి మండల కేంద్రంలోనీ హాస కొత్తూరు క్రాస్ రోడ్ వద్ద కొండా లక్ష్మణ్ బాపూజీ 108వ జయంతినీ పురస్కరించుకుని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బుధవారం ఆవిష్కరించారు. పద్మశాలి నేతలు మంత్రి వేములకు అపూర్వ స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు. జై మార్కండేయ జోహార్ బాపూజీ నినాదాలతో పద్మశాలిలు హోరెత్తించారు.
విగ్రహ ఆవిష్కరణ అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి వేముల ప్రసంగిస్తూ, .కొండా లక్ష్మణ్ బాపూజీ 108వ జయంతి సందర్భంగా విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం సంతోషంగా ఉన్నదన్నారు.తన చేతుల మీదుగా ఆవిష్కరణ జరగడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.కేసిఆర్ తో కలిసి ఆయనతో చాలా సార్లు మాట్లాడాడని అన్నారు.ఆయన ముక్కు సూటి వ్యక్తిత్వం గల మనిషని, ఆయన ఏ విషయమైనా సూటిగా స్పష్టంగా చెప్పేవారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నాటి జ్ఞాపకాలు నేమరేసుకున్నారు.

- Advertisement -
   

కేసిఆర్ తో తెలంగాణ ఉద్యమంతో బాపూజీ ది విడదీయరాని బంధమని తెలిపారు. కేసిఆర్ తెలంగాణ కోసం బయటకు వచ్చినప్పుడు నాటి సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత రాజ శేఖర్ రెడ్డి కుల బలం,ధన బలంతో ఉన్నారు.అయినా బక్క పలుచని కేసిఆర్ వాళ్ళను ఎదుర్కొన్నాడనీ అన్నారు. కేసిఆర్ బలం తెలంగాణ ఏర్పాటు కాంక్షనే అన్నారు. హైదరాబాద్ లో టిఆర్ఎస్ ఆఫీస్ కోసం కిరాయికి కూడా ఎవరు ఇల్లు ఇవ్వలేనీ రోజులు అని ఎవరూ కిరాయికి ఇవ్వొద్దని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు దుర్మార్గంగా వ్యవహరించారన్నారు. కానీ కొండా లక్ష్మణ్ బాపూజీ తనకు కేటాయించిన ఇంటిని తెలంగాణ రాష్ట్ర సమితి కోసం ఇచ్చారని, నాటి ఆంధ్ర పాలకులను ఎదురించి మలిదశ ఉద్యమానికి నీడనిచ్చిన ధీశాలి కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. జల దృశ్యంలోని ఇంటిలో ఉన్న ఆఫీస్ తాళాలు పగులగొట్టి ఫర్నిచర్ బయట పడేశారన్నారు. దాన్ని అప్పుడు ఛాలెంజ్ గా తీసుకున్న కేసిఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అదే ప్రాంతంలో ప్రపంచమే అబ్బుర పడేవిధంగా తెలంగాణ అమరుల స్మారకం నిర్మించారని అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీతో కేసిఆర్ అత్యంత సాన్నిహిత్యంగా ఉండే వారని,
ఆయన్ను బాపు అని పిలిచేవారని గుర్తు చేశారు.ఆయన అంటే అమితమైన ప్రేమ గల కేసిఆర్ నేడు స్వరాష్ట్రంలో అధికారికంగా జయంతి నిర్వహిస్తూ ఆయనకు అసలైన నివాళులు అర్పిస్తూ గౌరవ విస్తున్నారనీ అన్నారు. బాల్కొండ అన్ని మండల కేంద్రాల్లో లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని పెట్టలనేది తన కోరికనీ మంత్రి ఈ సందర్బంగా వెల్లడించారు.

తన కన్న తల్లి ఆరోగ్యం బాగా లేక హైదరాబాద్ హాస్పటల్ లో ఉన్నా రాత్రి పోయి, ఈ మీటింగ్ కోసం వచ్చానని చెప్పారు. పద్మశాలి లు మీటింగ్ పెట్టుకొని నన్ను పిలిచి ప్రత్యేక గౌరవించారనీ, తనను మొదటి నుండి కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నారనీ పద్మశాలి కులస్థులకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. రానున్న రోజుల్లో పద్మశాలి అభివృద్ది కోసం కృషి చేస్తామని ప్రకటించారు. వచ్చే ఐదేళ్లలో ఉచిత విద్య,ఉచిత వైద్యంపైనే కేసిఆర్ ప్రధానంగా దృష్టి సారించనున్నారనీ అన్నారు. కార్పొరేట్ స్థాయి విద్య, సూపర్ స్పెషాలిటీ వైద్యం పేదలకు అందాలనీ,అట్లాగే పేదలను ఆర్దికంగా బలోపేతం చేసేందుకు మరిన్ని సంక్షేమ పథకాలు తెనున్నరని అన్నారు. ఇంతటి గొప్ప కార్యక్రమంలో తనను భాగస్వామ్యం చేసిన కమ్మర్ పల్లి మండల పద్మశాలి సంఘం నేతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రేగుంట దేవేందర్ ఎంపీపీ గౌతమి జెడ్పిటిసి పెరమండ్ల రాధ గ్రామ సర్పంచ్ గడ్డం స్వామి ఎంపీటీసీ మైలారం సుధాకర్ కోఆప్షన్ సభ్యులు పాషా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement