Friday, May 3, 2024

TS: మీ ఆశీర్వాదాలే… నాకు శ్రీరామ రక్ష.. ఎమ్మెల్యే హరిప్రియ నాయక్

ఇల్లందు : మీ ఆశీర్వాదాలే నాకు శ్రీరామరక్ష అని ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ అన్నారు. ఇవాళ మున్సిపాలిటీ పరిధిలోని 1, 21, 22, 23 వార్డుల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు పెద్దఎత్తున స్వాగతం పలికారు. అనంతరం జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఇల్లందు మున్సిపాలిటీ రూపురేఖలు మార్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి, తనకు దక్కిందన్నారు.

గతంతో పోల్చుకుంటే ఇల్లందు మునిసిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని, ఇందుకు ప్రజలు ఇచ్చిన చేయూత కారణమన్నారు. త్వరలో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో ఆశీర్వదించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, వార్డు కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement