Sunday, May 29, 2022

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం.. తాగి తిట్టినందుకు మర్మాంగాలు కోసేశాడు

ఇద్ద‌రు వ్య‌క్తుల మ‌ధ్య జ‌రిగిన ఓ గొడ‌వ దారుణానికి దారితీసింది. ఇరువురి మ‌ధ్య మాటామాటా పెరుగ‌డంతో ఒక వ్య‌క్తి మ‌రో వ్య‌క్తి చెవిని, మ‌ర్మాంగాల‌ను కోసేశాడు. భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా కేంద్ర‌మైన కొత్త‌గూడెం ప‌ట్ట‌ణ స‌మీపంలోని రుద్రాపూర్‌లో మంగ‌ళ‌వారం రాత్రి ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న పోలీసులు కేసు న‌మోదుచేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

హైద‌రాబాద్‌లోని మౌలాలి ప్రాంతానికి చెందిన సేల్స్‌మెన్ రుద్రారపు కార్తీక్ పని నిమిత్తం రుద్రాపూర్‌కు వెళ్లాడు. మంగ‌ళ‌వారం రాత్రి అక్క‌డే ఓ సెల్ ట‌వ‌ర్ కింద ప‌డుకున్నాడు. అదే స‌మ‌యంలో తాగిన మైకంలో అటుగా వ‌చ్చిన స్థానికుడు షేక్ హుస్సేన్ పాషా.. కార్తీక్‌తో గొడ‌వ‌కు దిగాడు. వ‌చ్చీ రావ‌డంతోనే బూతులు తిట్ట‌డం మొద‌లుపెట్టాడు. దాంతో ఆగ్ర‌హించిన కార్తీక్ త‌న ద‌గ్గ‌రున్న క‌త్తితో హుస్సేన్ పాషాపై దాడికి దిగాడు. హుస్సేన్ చెవితోపాటు మ‌ర్మాంగాల‌ను కోసేశాడు. దాంతో తీవ్ర ర‌క్త‌స్రావం అవుతున్న హుస్సేన్‌ను స్థానికులు చికిత్స నిమిత్తం ఖ‌మ్మం ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. స్థానికులు ఇచ్చిన స‌మాచారం మేర‌కు ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు నిందితుడు కార్తీక్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడిపై ప‌లు సెక్ష‌న్‌ల కింద కేసులు న‌మోదు స్థానిక సీఐ స‌త్య‌నారాయ‌ణ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement