Tuesday, March 26, 2024

దసరా కే ఆచార్య ?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆచార్య. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. అలాగే చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా… రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఇదిలా ఉండగా కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ జూలై మొదటి వారంలో రీస్టార్ట్ కాబోతోంది.

ఈ షెడ్యూల్ ను మొదలుపెట్టి 20 రోజుల్లోనే పూర్తి చేయాలనుకుంటున్నారట దర్శకనిర్మాతలు. ఈ షెడ్యూల్ లో చిరంజీవి చరణ్ కూడా పాల్గొంటారని తెలుస్తోంది. మొత్తం అన్ని కార్యక్రమాలను ఆగస్టులో పూర్తిచేసి దసరాకి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. అలాగే దసరాకి మరో వైపు నందమూరి బాలకృష్ణ అఖండ కూడా రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. మరి రెండు సినిమాల మధ్య పోటీ ఏ విధంగా ఉంటుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement