Friday, May 3, 2024

పోలీసు జాగిలానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

ఖమ్మం సిటీ : ఖమ్మం జిల్లా పోలీసు శాఖలో 2010వ సంవత్సరం నుంచి పోలీస్ విధులు నిర్వహిస్తున్న (explosive dog) పూనమ్ అనే పోలీస్ జాగిలం శుక్రవారం తుదిశ్వాస విడిచింది. 13 ఏళ్ల పూనమ్ పోలీస్ శాఖలో అనేక క్లిష్టమైన కేసులను ఛేదించడంలో కీలక భూమిక పోషించింది. ఈ క్రమంలో పూనమ్ మృతితో పోలీసు శాఖలో తీవ్ర విషాదం చోటు చేసుకోగా శుక్రవారం పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్, పోలీసులు పోలీస్ లాంఛనాలతో పూనమ్ అంత్యక్రియలు నిర్వహించారు.

పూనమ్ అనే ఈ ఫిమేల్ పోలీసు జాగిలం 2010లో పోలీస్ ఫోర్స్ లో చేరింది. శిక్షణలోనే గోల్డ్ మెడల్ సాధించింది. 2011లో చర్ల కూబింగ్ ఆపరేషన్ లో నాలుగు మందు పాత్రలను వెలికితీసింది. 2014లో భద్రాచలం బస్టాండులో పేలుడు పదార్థాలను కనుగొన్నది. పోలీస్ ఆర్సీ కోర్సులో నాలుగు బంగారు పతకాలు సాధించిన ఘనత పూనమ్ కు వుంది. ప్రాథమిక కోర్సును పూర్తి చేసింది. పోలీసు జాగిలాలకు ప్రాథమిక కోర్సు కోసం ఇచ్చే శిక్షణ సమయంలో పూనమ్ మెదటి స్థానంలో నిలిచిందని డాగ్ హ్యాండ్లర్ షేక్ పాషా తెలిపారు. కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ డీసీపీ కుమారస్వామి, ఆర్ఐ లు రవి, శ్రీనివాస్, తిరుపతి, శ్రీశైలం పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement