Friday, April 26, 2024

వైరా జోడోయాత్రలో అపశృతి..

రేణుకా చౌదరి నడుపుతున్న ట్రాక్టర్ టైరు కింద పడి ఖమ్మం కార్పొరేటర్ భర్త ముస్తఫా కు తీవ్ర గాయాలు.. స్థానిక ఆసుపత్రికి తరలింపు…

వైరా : ఖమ్మం జిల్లాలోని వైరా పట్టణంలో ఆదివారం సాయంత్రం జరిగిన కాంగ్రెస్ హా త్సేహాత్ జూడో యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. మాజీ కేంద్రమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి ఫుల్ జోష్ తో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల కేరింతల మధ్య ట్రాక్టర్ నడుపుతుండగా ఖమ్మం నగరంలోని కార్పొరేటర్ ఫరీదా బేగం భర్త, కాంగ్రెస్ నాయకులు ముస్తఫా కాలు ట్రాక్టర్ టైర్ కింద పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. ఈ యాత్రలో టిపిసిసి వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యరావు టాక్రే తో పాటు ఎఐసిసి కార్యదర్శి రోహిత్ చౌదరి, ఉమ్మడి ఖమ్మం జిల్లా నలుమూలల నుండి వచ్చిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement