Tuesday, March 26, 2024

ధోని రిటైర్మెంట్‌పై ‘చాట్‌జిప్ట్’ సమాధానం..

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ‌ ఐపీఎల్ 2023 ముగిసిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటించేస్తాడని పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి MS ధోని ఐపీఎల్‌ రిటైర్మెంట్‌ ఎప్పుడన్న ప్రశ్నపై కృత్రిమమేధ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) ఆధారంగా పనిచేసే ‘చాట్‌జీపీటీ’ ఆసక్తికర సమాధానం ఇచ్చింది. ‘నా వద్ద ధోనీకి సంబంధించిన అంతర్గత సమాచారం గానీ, అతడి వ్యక్తిగత ఆలోచనలు, ప్రణాళికలు లేవు. అందువల్ల, ధోనీ IPL 2023 తర్వాత రిటైర్ అవుతాడో లేదో నేను కచ్చితంగా అంచనా వేయలేను. ధోనీ రిటైర్మెంట్ తీసుకోవాలా? వద్దా? అనేది అతడి ఫిట్‌నెస్, ఫామ్, ఆసక్తి వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. వీటి ఆధారంగానే ధోని నిర్ణయం ఉంటుంది. ఈ అంశంలో నేను కచ్చితమైన సమాధానం ఇవ్వలేను’ అని చెప్పింది.

- Advertisement -

2008 నుంచి ఐపీఎల్ జరుగుతుండగా.. ఇప్పటికే 15 సీజన్లు ముగిశాయి. ఈ క్రమంలో నాలుగు సార్లు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుని విజేతగా నిలిపిన కెప్టెన్ ధోనీ.. టోర్నీలోనే విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. కానీ.. బ్యాటర్‌గా మాత్రం గత రెండు సీజన్లలో ధోనీ అంచనాల్ని అందుకోలేకపోయాడు. మార్చి తొలి వారం నుంచే చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ధోనీ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement