Sunday, April 28, 2024

వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలి

రాష్ట్రంలో ప్రస్తుత యాసంగి సీజన్లో రైతులు పండించిన వరి ధాన్యం మొత్తాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని ఖమ్మం జిల్లా పరిషత్ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో తీర్మానాన్ని జడ్పీ చైర్మన్ ప్రవేశపెట్టగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలుపుతూ తీర్మానం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పంపారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ కమల్ రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో పండిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని ఇబ్బందులకు గురి చేయడం తగదని పేర్కొన్నారు. పంజాబ్ రాష్ట్రంలో ఒక రకంగా తెలంగాణ రాష్ట్రంలో మరో రకంగా కేంద్రం వ్యవహరించడాన్ని తప్పుపట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ , మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా పరిషత్ లో ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం బాధ్యత వహించాలని ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement