Thursday, May 9, 2024

Khammam : దశాబ్ది ఉత్సవాల్లో పరిశ్రమల దినోత్సవం సంతోషకరం.. మంత్రి పువ్వాడ

ఖమ్మం : రాష్ట్రంలో సీఎం కేసీఅర్ నేతృత్వంలో పారిశ్రామిక ప్రగతి అద్భుతంగా కొనసాగుతుందని, దేశంలోనే తెలంగాణ ప్రత్యేక స్థానం కైవసం చేసుకుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఖమ్మం IT Hub లో జరిగిన తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవానికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత Vdo’s క్యాంపు కార్యాలయం నుండి IT Hub వరకు మోటార్ సైకిల్ పై ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఐటీ హబ్ లో ఎర్పాటు చేసిన సభలో మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. ఒకప్పుడు తెలంగాణ పరిశ్రమలకు నీళ్లు, కరెంటు లేక పరిశ్రమలు మూసేసిన రోజుల నుండి నేడు అనేక రంగాల్లో సామాన్యులు సైతం పరిశ్రమలు నెలకొల్పి విజయవంతం అయ్యారని అన్నారు. నూతనంగా పరిశ్రమలు ఎర్పాటు చేసుకున్న వారికి నేడు 24గంటలు పరిశ్రమ నడిపే విధంగా అన్ని సౌకర్యాలు కల్పించింది తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు.


తెలంగాణలో పరిశ్రమ స్థాపించాలి అంటే ఆఫీస్ ల చుట్టూ తిరిగే అవసరం లేకుండా TS-ipass ద్వారా 15 రోజులలో అన్ని అనుమతులు లభించే విధంగా పారిశ్రామిక విధానంను ముఖ్యమంత్రి కేసీఅర్ రూపొందించారని పేర్కొన్నారు.
తెలంగాణ వచ్చినపట్టి నుండి 9 ఏళ్లలో 23 వేలకు పైగా కొత్త పరిశ్రమలు, 17 లక్షల మందికి పైగా యువతకు ఉపాధి అవకాశాలు లభించాయని వివరించారు. ఒకప్పుడు వారంలో కేవలం 4రోజులు పరిశ్రమలు నడుపుకుని మిగతా మూడు రోజులు power హాలిడే ప్రకటించిన అంశాన్ని గుర్తు చేశారు.గ్రానైట్ పరిశ్రమను కడుపులో పెట్టుకుని కాపాడుకున్నాది ఒక్క తెలంగాణ ప్రభుత్వం మాత్రమే అని అన్నారు. మొన్ననే UK, US వెళ్లి అక్కడ ఉన్న అనేక పరిశ్రమ CEO లను, అధినేతకు కలిసి తెలంగాణ రాష్ట్రంలో ఉత్పన్నమవుతున్న పారిశ్రామిక వృద్ది, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారంను వివరించి వారిని ఆకర్షించారని, మరో 40వేల నూతన ఉద్యోగ అవకాశాలు రానున్నాయని పేర్కొన్నారు.బహుళజాతి ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ తయారీ కంపెనీ ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ తెలంగాణలో తయారీ ప్లాంట్‌ను ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

పారదర్శక విధానాలు సుస్థిర ప్రగతి, విధానాల అమలులో వేగం, పాలనలో మరింత వేగం వంటివి పెట్టుబడులకు ఊతంగా నిలుస్తున్నాయని, తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెడుతోందని వివరించారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్ సారధ్యంలో రోజుకో రికార్డును సొంతం చేసుకుంటున్నదని, పెట్టుబడుల సాధన, పరిశ్రమల వ్యవస్థాపన, ఉపాధి కల్పనలో జెట్‌ వేగంతో దూసుకుపోతోందని స్పష్టం చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని ఏక గవాక్ష అనుమతులతో సరికొత్త రికార్డులను సొంతం చేసుకుంటోంది. అనంతరం ఉత్తమ పారిశ్రామిక వేత్తలకు ప్రసంశా పత్రాలు, మేమెంటోలు ఇచ్చి సత్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధు, విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వర రావు, మేయర్ పునుకొల్లు నీరజ, జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహరా, సుడా చైర్మన్ విజయ్ కుమార్, ఎమ్మెల్యే రాములు నాయక్, జిల్లా కలెక్టర్ VP గౌతమ్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, పరిశ్రమల శాఖ GM అజయ్ కుమార్, వివిధ కంపెనీల CEO లు అధికారులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement