Monday, April 29, 2024

Delhi: కవిత బెయిల్ పిటిషన్ విచారణ ఈనెల 4కు వాయిదా

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ విచారణ ఈనెల 4 కి వాయిదా పడింది. తన మైనర్ కుమారుడి పరీక్షల నేపథ్యంలో ఈనెల 16వ తేదీ వరకు బెయిల్ మంజూరు చేయాలని గత నెల 26న ఆమె రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ బెయిల్ పిటిషన్ పై కవిత తరపున అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపిస్తూ.. కవితకు మధ్యంతర, రెగ్యులర్ బెయిల్స్ ఇవ్వాలని కోరారు. ఈడీ విచారణకు కవిత సహకరించారని కస్టడీలో ఉన్న సమయంలో ఒక్కొసారి రాత్రి పొద్దుపోయే వరకు విచారించారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.

ఎఫ్ఐఆర్ లో ఎక్కడా కవిత పేరు లేదని కేవలం నిందితుల స్టేట్ మెంట్ ను అనుబంధ చార్జిషీట్లలో పేర్కొన్నారన్నారు. లిక్కర్ స్కామ్ లో కవిత ప్రమేయం ఉన్నట్లు ఎక్కడా ఆధారాలు లేవన్నారు. ఈడీ కౌంటర్ కు సమాధానం ఇవ్వడానికి గడువు కావాలని సింఘ్వీ కోరారు. దీంతో ఈనెల 3వ తేదీ సాయంత్రం వరకు కోర్టుకు వివరించాలని స్పెషల్ జడ్జి ఆదేశించారు. దానిని పరిశీలించిన తర్వాత ఏప్రిల్ 4న విచారించ‌నున్న‌ట్లు కోర్టు పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement