Friday, May 3, 2024

Peddapalli: బీఆర్ఎస్ తోనే సంక్షేమ పాలన… ఎమ్మెల్యే దాసరి

బీఆర్ఎస్ తోనే సంక్షేమ పాలన కొనసాగుతుందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని అంకంపల్లి మడిపల్లి కాలనీ గ్రామంలో గడపగడపకు సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి మాట్లాడుతూ… గతంలో ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధి సంక్షేమ పథకాలు సీఎం కేసీఆర్ దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతుబంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ అంటే నమ్మకమని ఆ నమ్మకంతోనే రాష్ట్రంలో, పెద్దపల్లిలో మూడోసారి కూడా గులాబీ పార్టీని గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. పెద్దపల్లి నియోజకవర్గంలో మునుపెన్నడూ లేని విధంగా పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులు చేస్తున్నామని, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు.

మరోసారి ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు బూటకపు హామీలతో మభ్యపెట్టే ప్రయత్నాలు చేసినా అసలైన అభివృద్ధి కండ్లకు కట్టినట్లు చూపించిన బీఆర్ఎస్ కే ప్రజల మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే దాసరికి స్థానిక ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూనేటి సంపత్ యాదవ్, జెడ్పిటిసి వంగల తిరుపతిరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గొడుగు రాజ కొమురయ్య యాదవ్, స్థానిక సర్పంచులు ఆకుల చిరంజీవి, తీగల స్వప్న, రాణి, మంద రమ, ఎంపీటీసీ సంపత్, నాయకులు జిన్న రామచంద్రారెడ్డి, శిలారపు మల్లయ్య వెంకన్న, నాగరాజు, మోహన్, నాంసాని నాగరాజు, ఆకుల వివేక్ పటేల్, కాసర్ల తిరుపతి, బండారి కనకయ్య, నర్సింగ్ గట్టు, సంపత్, కూకట్ల నవీన్ యాదవ్, పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement