Friday, May 3, 2024

గ్రామాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి..

కాల్వశ్రీరాంపూర్‌: ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులపై పంచాయతీ పాలకవర్గం ప్రత్యేక శ్రద్ధ వహించాలని మండల తహసిల్దార్‌ సునీత పేర్కొన్నారు. మండలంలోని మెట్లపల్లి గ్రామంలో నర్సరీ, పల్లె ప్రకృతి వనం, స్మశాన వాటిక, చెత్త సేకరణ కేంద్రం తదితర అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మిగిలిన అభివృద్ధి పనులను పూర్తి స్థాయిలో త్వరితగతిన పూర్తి చేయాలని సర్పంచ్‌ గోనె శ్యామ్‌కు సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభివృద్ధి పనులను గ్రామాల్లో పంచాయతీ పాలకవర్గం త్వరితగతిన నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో నిర్మిస్తున్న పల్లె ప్రకృతి వనాలు, చెత్త సేకరణ కేంద్రం, స్మశాన వాటికల నిర్మాణం, డంపింగ్‌ యార్డుల నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. హరితహారంలో నాటిన ప్రతి మొక్కను కాపాడేందుకు సామాజిక బాధ్యతగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజేష్‌, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement