Thursday, April 18, 2024

అన్నదాతకు మేలు చేయడమే లక్ష్యం – పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి

పెద్దపల్లి రూరల్ : ఆరుగాలం కష్టం చేసి పంటలు పండిస్తున్న అన్నదాతకు మేలు చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పెద్దపల్లి మండలం తుర్కల మద్దికుంట గ్రామంలో పీఏసీఎస్‌ ద్వారా ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ సీఎం కేసీఆర్‌ రైతుబాంధవుడిగా నిలిచాడన్నారు. రైతుబంధుతో పెట్టుబడి సాయం, రైతు బీమాతో మరణించిన రైతు కుటుంబానికి రూ. 5లక్షల సాయం, 24 గంటల ఉచిత విద్యుత్‌ తదితర రైతులకు మేలు చేసే పథకాలను అమలు చేస్తున్నారన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్‌, జడ్పీటీ-సీ బండారి రామ్మూర్తి, పీఏసీఎస్‌ ఛైర్మెన్‌ మాదిరెడ్డి నరసింహా రెడ్డి, వైస్‌ ఎంపీపీ ముత్యాల రాజయ్య, సర్పంచ్‌ జయప్రద సంజీవ రెడ్డి, ఉపసర్పంచ్‌ జాన్‌, గ్రామ శాఖ అధ్యక్షుడు చాంద్‌ పాషా, సహకార డైరెక్టర్‌లు జైపాల్‌, నాయకులు సంపత్‌ రెడ్డి, ఈదునూరి నర్సింగ్‌, సల్లు, ఆవుల లక్ష్మయ్య, గోపాల్‌ రెడ్డి, మొగిలి, శంకర్‌, రాజేశం, ఐలయ్య, రాయమల్లు, నర్సయ్య, నాగరాజు, యూసుఫ్‌, రైతులు, తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement