Thursday, April 25, 2024

టమోటా రైతులను ఆదుకోవాలి.. చంద్రబాబు

కనీస ధర లేక నష్టపోతున్న టమోటా రైతులను ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కోరారు. టమోటా ధర పతనంపై చంద్రబాబు ట్విట్టర్ లో స్పందించారు. అమ్మబోతే అడివి.. కొనబోతే కొరివి అన్నట్లుంది టమోటా రైతుల పరిస్థితి అన్నారు. పత్తికొండ మార్కెట్ లో కిలో టమోటా ధర రూ.3లకు పడిపోయిందని, వినియోగదారులు మాత్రం కిలో రూ.30లకు పైనే పెట్టి కొనాల్సి వస్తోందన్నారు. రైతులను ఆదుకునేందుకు జగన్ చెప్పిన ధరల స్థిరీకరణ నిధి ఏమైందని చంద్రబాబు ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement