Monday, May 6, 2024

దేశానికి ఆదర్శంగా తెలంగాణ విద్యా వ్యవస్థ : కొప్పుల

దేశానికి ఆదర్శంగా తెలంగాణ విద్యా వ్యవస్థను నిలపాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ లక్ష్యమని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. అంతర్గాం మండలం ఎల్లంపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన కస్తూరిబాయి గాంధీ గురుకుల పాఠశాలను రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని పేద విద్యార్థులకు ఉన్నతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సిఎం కేసీఆర్‌ గురుకుల పాఠశాలలు, కస్తూర్బా విద్యాలయాలు, మోడల్ స్కూళ్లను ఏర్పాటు చేసి విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందిస్తున్నారన్నారు. ప్రతి విద్యార్థి పై ఒక లక్షా ఇరవై ఐదు వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసి ఉచితంగా విద్య, భోజనం అందించడం జరుగుతుందన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో విద్యాభివృద్ధి గొప్పగా సాగుతుందని ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ తరహా విద్యా భోధన చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరిగాయని రిజల్ట్స్ శాతం కూడా పెరిగిందని అన్నారు. ఈ కార్యక్రమం లో మండల ఎంపీపీ దుర్గం విజయ, జడ్పీటీసీ ఆముల నారాయణ, వైస్ ఎంపీపీ మట్ట లక్ష్మీ మహేందర్ రెడ్డి, డి.ఈ.ఓ మాధవి, ఎంఈఓ లక్ష్మీ తహశీల్దార్ వేణుగోపాల్ సర్పంచ్ లు గుమ్ముల రవీందర్, ధరని, రాజేశ్, బాదరవేని స్వామి, తుంగపిండి సతీష్, జిల్లా కో ఆప్షన్ సభ్యులు దివాకర్, మండల కో ఆప్షన్ సభ్యులు గౌస్ పాషా, మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తిరుపతినాయ,క్ నాయకులు రామన్న, ఇసంపల్లి తిరుపతి, గీట్ల శంకర్ రెడ్ది ఆవుల గోపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement