Sunday, April 28, 2024

KNR: శ్రీపాదరావు ఆశయ సాధనకు కృషి చేయాలి.. ఎమ్మెల్యే విజయరమణరావు

సుల్తానాబాద్‌, ఏప్రిల్‌ 13 (ప్రభన్యూస్‌): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ స్పీకర్‌, దివంగత దుద్దిళ్ల శ్రీపాదరావు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. శనివారం సుల్తానాబాద్‌ పట్టణంలోని నెహ్రూ చౌరస్తా వద్ద మాజీ స్పీకర్‌ దుద్దిల్ల శ్రీపాద రావు 25వ వర్ధంతి వేడుకలను కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహంచారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే విజయరమణారావు హాజరై శ్రీపాద రావు చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు.

అనంతరం ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో శాసనసభను గొప్పగా నిర్వహించడంలో శ్రీపాదరావు తనదైన పాత్ర పోషించారని గుర్తు చేశారు. నిరంతరం ప్రజల కోసమే ఆయన తపించారని, చివరి శ్వాస వరకు ప్రజల్లోనే ఉన్నారన్నారు. అలాంటి గొప్ప నాయకుడు శ్రీపాదరావు మన మధ్యలో లేకపోవడం భాదకరమని, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ.. ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్క కాంగ్రెస్‌ కార్యకర్త కృషి చేయాలన్నారు. సుల్తానాబాద్‌ పట్టణానికి శ్రీపాద రావుకి విడదీయలేని అనుబంధం ఉందన్నారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement