Friday, April 26, 2024

కోలేటి ఫౌండేషన్‌ ద్వారా సేవా కార్యక్రమాలు.. కోలేటి దామోదర్‌

గోదావరిఖని : కోలేటి ఫౌండేషన్‌ ద్వారా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ కార్పోరేషన్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్‌ తెలిపారు. గురువారం రామగుండం, గోదావరిఖని ప్రాంతాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా ఒక రోజు ముందుగానే సేవా కార్యక్రమాల్లో భాగంగా మహిళలకు చీరలు పంపిణీ చేశారు. గుజరాత్‌లోని సూరత్‌లో ప్రత్యేకంగా తయారు చేయించిన 23వేల చీరలను స్వయంగా దామోదర్‌ మహిళలకు అందించారు. కోలేటి ఫౌండేషన్‌ ద్వారా ఏడాదికాలంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వివరించారు. వరదలు వచ్చిన సమయంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందించామని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా తమవంతుగా మహిళల కోసం చీరలను అందించినట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement