Friday, June 2, 2023

మూడు రాజధానులే మా విధానం : మంత్రి బొత్స

మూడు రాజధానులే తమ ప్రభుత్వ విధానమంటూ ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్ర రాజధానిపై ప్రభుత్వ వైఖరి ఇదేనంటూ ఆయ‌న‌ కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రాజ‌ధానుల విష‌యం మా ముఖ్యమంత్రి జగన్, మా ఆర్థిక మంత్రి బుగ్గన అసెంబ్లీలో చెప్పారని బొత్స అన్నారు. అసెంబ్లీలో మేము సమర్థించామని, ఇదే తమ ప్రభుత్వ విధానం అని, ఇందులో మరో వాదనకు తావులేదని అన్నారు. అమరావతి శాసన రాజధాని, విశాఖ పరిపాలన రాజధాని, కర్నూలు న్యాయ రాజధాని అని బొత్స వివరించారు. అభివృద్ధి వికేంద్రీకరణకు తాము కట్టుబడి ఉన్నామన్నారు. 26 జిల్లాలు కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉన్న‌ద‌ని బొత్స అన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement