Thursday, May 2, 2024

మట్టి విగ్రహాలతో కాలుష్య నియంత్రణ… కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

గణపతి నవరాత్రి ఉత్సవాలలో మట్టి విగ్రహాలు ప్రతిష్టించడం వల్ల కాలుష్య నియంత్రణ సాధ్యమవుతుందని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ తెలియజేశారు. శనివారం తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి సౌజన్యంతో మట్టి విగ్రహాల ను పంపిణీ చేశారు.

అనంతరం మాట్లాడుతూ…. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, గణపతి విగ్రహాల కోసం వాడే రసాయనాల వల్ల పర్యావరణం దెబ్బతింటుందన్నారు. ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను ప్రతిష్టించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్యాం ప్రసాద్, అరుణశ్రీ తో పాటు జిల్లా స్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement