Tuesday, May 21, 2024

వ్యాక్సిన్ పై అపోహలు వద్దు – పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి

పెద్దపల్లి – కోవిడ్ వ్యాక్సిన్ పై అపోహలు వద్దని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే దాసరి దంపతులు వ్యాక్సిన్ తీసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం కరోన కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయని, ప్రజలందరూ కచ్చితంగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని, ఎప్పటికప్పుడు చేతులను శుభ్రపరచుకోవాలన్నారు. వ్యక్తిగత శుభ్రత పాటించి నిబంధనలు పాటిస్తే కరోనా బారిన పడకుండా ఉండొచ్చన్నారు .

Advertisement

తాజా వార్తలు

Advertisement