Wednesday, May 19, 2021

నర్సరీలను పరిశీలించిన ఎంపీడీఓ..

సుల్తానాబాద్‌: మండలంలోని పలు గ్రామాల్లో నర్సరీలను ఎంపీడీఓ గంగుల సంతోష్‌కుమార్‌ సందర్శించారు. మండలంలోని దుబ్బపల్లి, కాట్నపల్లి నర్సరీలతోపాటు పల్లె ప్రకృతి వనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న వర్షాకాలంలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు నర్సరీలలో మొక్కలను సిద్ధం చేయాలన్నారు. అలాగే పల్లె ప్రకృతి వనాలను గ్రామాల్లోని ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేలా ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, వాటిని సంరక్షించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నర్సరీల నిర్వాహకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News