Monday, April 12, 2021

నిత్యావసర సరుకుల పంపిణీ..

పెద్దపల్లిరూరల్‌: లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ పెద్దపల్లి ఎలైట్‌ క్లబ్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్‌ గుజ్జుల కుమార్‌ కూతురు సిరి జన్మదిన సందర్భంగా టీచర్స్‌ కాలనీలోని 15 మంది ప్రైవేటు ఉపాధ్యాయులకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అలాగే క్లబ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం వద్ద 150 మజ్జిగ పాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్‌ అధ్యక్షుడు అశోక్‌కుమార్‌, ప్రతినిధులు వంశీరాజ్‌, సంపత్‌రావు, టి. శ్రీనివాస్‌, శ్రీనివాస్‌, గుజ్జుల కుమార్‌, పిట్ట రమేశ్‌, శ్రీధర్‌, సతీష్‌రెడ్డి, లింగారావు, ట్రస్మా మండల అధ్యక్షుడు శ్రీర్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News