Tuesday, April 16, 2024

గంగుల కమలాకర్ ను ఓదార్చిన మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్

రాష్ట్ర బీసీ సంక్షేమం, ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తండ్రి గంగుల మల్లయ్య (87) మృతి పట్ల ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సంతాపం వ్యక్తం చేశారు. గురువారం ఉదయం కరీంనగర్ లోని గంగుల కమలాకర్ ఇంటికి వెళ్లి మల్లయ్య పార్థీవ దేహంపై పుష్ప గుచ్చం ఉంచి నివాళులర్పించారు. గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ఈ ఉదయం 11 గంటల నుండి మార్కండేయ నగర్ లోని మానేర్ రిజర్వాయర్ వద్ద గల స్వర్గధామం యందు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. మంత్రులతో పాటు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయిన్ ప‌ల్లి వినోద్ కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు సుంకె రవి శంకర్, సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, పౌర సరఫరాల సంస్థ చైర్మన్ రవీందర్ సింగ్, కరీంనగర్ మేయర్, జడ్పీ చైర్మన్, కలెక్టర్, సిపి, సుడా చైర్మన్, కార్పొరేటర్లు ఉదయం నుండి పెద్ద సంఖ్యలో అభిమానులు గంగుల మల్లయ్య పార్థీవ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement