Saturday, May 8, 2021

ప్రజలకు మాస్కుల పంపిణీ..

పెద్దపల్లిరూరల్‌: కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిరుపేదలు, మహిళలకు మాస్క్‌లను పంపిణీ చేశారు. మేడేను పురస్కరించుకొని కాంగ్రెస్‌ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షుడు ఈర్ల కొమురయ్య పట్టణంలోని జెండా చౌరస్తా వద్ద మాస్కులను అందించారు. కరోనా సెకండ్‌ వేవ్‌ కేసులు తీవ్రమవుతున్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఈకార్యక్రమంలో నాయకులు కల్వల శ్రీనివాస్‌, సుతారి లక్ష్మణ్‌ బాబు, ఎస్‌కే సర్వర్‌, ఎస్పీ రాజయ్య, పీఎస్‌ వజియ్‌కుమార్‌, వేముల రాజు, ఉట్ల కిరణ్‌, బొడ్డుపల్లి తిరుపతి, లక్ష్మణ్‌, కోదాటి ప్రశాంత్‌లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News